ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలు ఆపేయాలని ఎలాంటి అదేశాలు లేవు

ఏపీలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషేంట్స్ ముగ్గురు మాత్రమేనని సీఎం అదనపు ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందనిఆయన చెప్పారు. ఏపీలో 6 ఉన్న టెస్టింగ్ ల్యాబ్ లను అన్ని జిల్లాలో మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు రమేష్ చెప్పారు. ప్రస్తుతం ఒక్కో టెస్ట్ రిపోర్ట్ కి ఆరు గంటల సమయం పడుతోందని, గంటన్నరలో టెస్ట్ ఫలితాలు వచ్చే కిట్ల కొనుగోలుకి సీఎం ఆదేశాలు ఇచ్చారని ఆయన వివరించారు. 

పదిరోజుల్లో ఇలాంటి 3 లక్షల కిట్లు వచ్చేలా ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పిన డాక్టర్ పీ వీ రమేష్, ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలు ఆపేయాలని ఎలాంటి అదేశాలు లేవని క్లారిటీ ఇచ్చారు. " కొన్నీ ప్రైవేట్ ఆసుపత్రులు అలా చేస్తున్నాయి, దీనిపై మాకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నా," మన్నారు ఆయన.