నటి సురేఖా వాణి భర్త మృతి
Published on: Mon May 6, 2019 6:12PM

ప్రముఖ నటి సురేఖా వాణి భర్త, టీవీ షోల దర్శకుడు సురేష్ తేజ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సురేఖ, సురేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు.కెరీర్ తొలినాళ్లలోనే సురేఖా వాణి, సురేష్ తేజ పెళ్లి చేసుకున్నారు. సురేష్ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. సురేష్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


