రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్.. ఎక్కడంటే.!
Published on: Tue Oct 13, 2026 8:41AM

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎంతోమంది అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల చేతికి చిక్కుతున్న కూడా.. వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు.. ఇప్పుడు తాజాగా మరో అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు.హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేసేందుకు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్ మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డిని కూడా నిందితుడిగా గుర్తించిన అధికారులు ఇద్దరినీ అరెస్టు చేశారు.హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకు జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేసేందుకు రూ.30 లక్షలతో మొదలైన లంచం బేరం చివరకు రూ.20 లక్షల వద్దకు చేరింది.

ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులును అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డిని సైతం నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడికి సంబంధించిన భూమిని హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం సర్వే చేసి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేయాల్సి ఉంది. ఈ పని పూర్తి చేసేందుకు తహసీల్దార్, మండల సర్వేయర్ లను బాధితులు కలిశాడు.అయితే ఇద్దరు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. తొలుత రూ.30 లక్షలుఇవ్వాలని కోరిన నిందితులు, అనంతరం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు తగ్గించారు.
లంచం డిమాండ్‌పై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు మండల సర్వేయర్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్ వద్ద ఉన్న లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులు తమ అధికారిక విధులను అక్రమంగా, అవినీతిపూరితంగా నిర్వహించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితులైన మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉండగా, వాటి కోసం భారీ మొత్తాల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
[ ACB Raid, Telangana ACB, Bribery Case, ₹20 Lakh Bribe, Abdullapurmet Surveyor, Batuk Srinivasulu, Tahsildar B Sudarshan Reddy, HMDA Survey Report, Joint Inspection Survey, Anti Corruption Bureau, ACB Arrests, Telangana Corruption Case, Bribe Demand, Chemical Test, Hyderabad ACB Court, Nampally Special Court ]


