TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

200 కోట్ల అక్రమాస్తులు: డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు.!

Published on: Thu Sep 24, 2026 3:33PM

మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. భీమ్ రెడ్డికి సంబంధించిన బినామీల ఇళ్లపై ఏసీబీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహిస్తున్నారు. భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా 8 మంది అనుమానిత బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. బినామీల పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించారు.హైదరాబాద్‌లోని పుప్పాల గూడలో బినామీల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. 

మరోవైపు రాయదుర్గంలోని పంచవటి కాలనీలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. భీమ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు. సోదాల్లో లభించే పత్రాలు, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. భీమ్ రెడ్డి కేసులో బినామీ ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తును ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. సుమారు రూ.200 కోట్లు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

 

[ ACB aggressive in DSP Bheem Reddy case, ACB officials, CM Revanth Reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu News ]