ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్: ఏడు సార్లు బాది వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న అభిషేక్ శర్మ.!
Published on: Thu Oct 22, 2026 5:07PM

టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్ లో ఇన్నింగ్స్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడంలో అభిషేక్ శర్మ ఈ రికార్డు సాధించాడు.

ఇప్పటి వరకూ అభిషేక్ వర్మ ఇన్నింగ్స్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా బాదిన సందర్భాలు ఏడు ఉన్నాయి. ఇంతకు ముందు వరకూ ఈ రికార్డు ఆప్ఠన్ ప్లేయర్ షఫికుల్లా ఫిన్వారీ పేరిట ఉండేది. కానీ న్యూజిలాండ్ తో గురువారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టి20లో అభిషేక్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 12 బంతులను ఎదుర్కొన్ని 29 పరుగులు చేసి ఔటయ్యాడు.
[Abhisheik Sharma world Record, Six 1st ball, Seven Times, Newzeland, T20 Series, Telugu One]


