TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీజేపీ చీఫ్ అభిజీత్ డిప్కేకు ఊరట.!

Published on: Sat Oct 17, 2026 6:13PM

ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు  అభిజీత్ డిప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో చేపట్టిన వివాదాస్పద 'లహ్రా దో తిరంగా' నిరసన ప్రదర్శన  శాంతి భద్రతల భంగం  ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన అభిజిత్  ఢిల్లీలోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. 

ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పాటు ఎటువంటి శాంతిభద్రతల సమస్యలకు తలెత్తకుండా ఉండాలనే నిబంధనపై ఒక శాంతి బాండ్‌పై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో అభిజీత్ డిప్కే విడుదల సులువైంది.

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ప్రదేశమైన జంతర్ మంతర్ వద్ద పార్టీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్  అజింక్య షిండే త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం రేపింది. ఈ అరెస్టులకు నిరసనగా సీజేపీ శ్రేణులు 'లహ్రా దో తిరంగా' ఉద్యమానికి పిలుపునిచ్చాయి. 

ఈ క్రమంలోనే అక్టోబర్ 10న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కార్యాలయం వద్ద ఓటర్ల జాబితా అవకతవకలు ఎస్ఐఆర్ (SIR) సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో అభిజిత్ దీప్కను పోలీసులు ముందుస్తు నిరోధక అదుపులోకి (preventive custody) తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భారీ జనసమూహం వల్ల ట్రాఫిక్ నిలిచిపోవడం తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని భావించే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ, కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

 

 

[ Abhijit Deepke, Cockroach Janta Party, Delhi Court Bail, Lehra Do Tiranga, CJP Founder, Delhi Police Arrest, Lehro Do Tiranga, BNSS Section 126, Delhi Police Detention, Telugu One, Telugu news ]