TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ మద్దతు కోరుతూ షర్మిలకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ.!

Published on: Sat Oct 17, 2026 9:56PM

విజయవాడ నగర మేయర్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించు కున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి లేఖ రాశారు. మేయర్ ఎన్ని కల్లో తన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.విజయవాడ మేయర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సీపీఎం, సీపీఐతో పాటు పలు ప్రజా సంఘాలు తనను కోరినట్లు ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో ప్రస్తావించారు. 


రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రత్యా మ్నాయ రాజకీయ వేదిక అవసరమని అభిప్రాయ పడ్డారు.ఈ నేపథ్యంలో తన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో పాటు, పార్టీ శ్రేణులు తన తరఫున ప్రచారం చేసి ఓటు వేయా లని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని షర్మిలను కోరారు.ఏబీ వెంకటేశ్వ రరావు విజ్ఞప్తిపై స్పందిం చిన వైఎస్ షర్మిలా రెడ్డి.. లేఖను పరిశీలించిన అనంతరం పార్టీ వైఖరిపై నిర్ణయం వెల్లడిస్తామని తెలిపినట్లు సమాచారం. దీంతో విజయవాడ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఎవరికి లభిస్తుం దనే అంశం ఆసక్తికరంగా మారింది.

 

 

 

[ AB Venkateswara Raos letter to Sharmila, Vijayawada City Mayors post,  Congress party, TDP, A P Municipal Elections, AP Local Body Polls,  Telugu One, Telugu news]