Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో 89 మంది భారతీయ నేరస్తులు
posted on: Feb 6, 2026 5:47PM
.webp)
అమెరికా గడ్డపై అక్రమంగా ఉంటూ నేరాలకు పాల్పడే వారిపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా దేశం నుంచి తరిమివేయాల్సిన 'మోస్ట్ వాంటెడ్' నేరగాళ్ల జాబితాను విడుదల చేసింది. 25 వేల మందితో కూడిన ఈ 'బ్లాక్ లిస్ట్'లో 89 మంది భారతీయులు ఉండటం ఇప్పుడు ప్రవాస భారతీయుల్లో కలకలం రేపుతోంది. హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి ఘోరమైన నేరాల్లో వీరంతా శిక్షలు అనుభవిస్తుండగా.. వీరిని ఇప్పుడు తిరిగి స్వదేశానికి పంపబోతున్నారు.
ముఖ్యంగా తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్ల జాబితాను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ట్రంప్ సర్కారు వీరిని సామూహికరంగా బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం కొత్తగా WOW.DHS.GOV అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ (WOW) పేరుతో రూపొందించిన ఈ డేటాబేస్‌లో సుమారు 25,000 మంది నేరచరిత్ర కలిగిన అక్రమ వలసదారుల వివరాలను పొందుపరిచారు.
ఇందులో నేరగాళ్ల పేర్లు, ఫోటోలు, వారు చేసిన నేరాలు, వారి జాతీయతను కూడా బహిరంగంగా ఉంచారు. ట్రంప్ ప్రభుత్వం ఈ బహిష్కరణలను 'నేషనల్ ఎమర్జెన్సీ'గా ప్రకటించి సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికాలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.






