TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు

Published on: Wed Nov 18, 2026 5:16PM

 ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు

ఇంట్లో సంతోషం , ప్రశాంతత ఉండాలంటే కేవలం ఆర్థిక పరిస్థితులు బాగుండటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా ఎంతో సజావుగా సాగాలి. ముఖ్యంగా ఏ ఇల్లయినా సంతోషంగా ఉండాలంటే అక్కడ అత్తాకోడళ్ల మధ్య అనుబంధం ఎంతో కీలకం అవుతుంది. సమాజంలో సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, గొడవలు ఉండటం సర్వసాధారణం అని అనుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రెండు వేర్వేరు తరాల ఆలోచనలు, వారి అనుభవాలు , వారి అంచనాలు ఒకే చోట ఉండటమే.. ఎప్పుడైతే ఇద్దరి మధ్య చిన్న పొరపాట్లు జరుగుతాయో, అవి క్రమంగా పెద్ద గొడవలుగా మారి ఇళ్లలోని శాంతిని దూరం చేస్తాయి. అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ బంధాన్ని మరింత గట్టిగా మార్చుకోవడానికి , ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణం నెలకొనడానికి కొన్ని సులభమైన మార్గాలను అందించారు. ఆ నాలుగు ముఖ్యమైన విషయాలను పాటిస్తే ఈ బంధంలో ఎప్పుడూ ఎలాంటి అనుమానాలు, గొడవలు రావని స్పష్టం చేశారు.అవేంటో తెలుసుకుంటే..

సంయమనం..

ఏదైనా ఒక విషయంపై  ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు లేదా ఒకరిమీద మరొకరికి  కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త సంయమనం పాటించడం చాలా అవసరం. కోపంలో నోటి వెంట వచ్చే మాటలు ఎప్పుడూ జీవితాంతం  ఇతరుల మనసులో చెడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కాబట్టి కోపం వచ్చిన తక్షణం గొడవ పడకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి మాటలు మరొకరు పూర్తిగా వినడం వల్ల చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. ఈ చిన్న నియమం వల్ల అత్తాకోడళ్ల మధ్య దూరం పెరిగే అవకాశమే ఉండదు.

పరస్పర గౌరవం..

అత్తాకోడళ్లు  ఒకరి భావాలను మరొకరు గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అత్తగారు ఏళ్ల తరబడి ఇంటి బాధ్యతలను మోస్తూ తనకంటూ కొన్ని పద్ధతులు ఏర్పరచుకుని ఉంటారు. అలాగే కోడలు కూడా తనదైన ఆలోచనలు, ఆధునిక భావనలతో కొత్త వాతావరణంలోకి అడుగుపెడుతుంది. ఇలాంటి సమయంలో ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను, వారి స్వేచ్ఛను గౌరవించాలి. అత్తగారు తన పాత అనుభవాలను గౌరవించాలని కోరుకుంటే, కోడలు కూడా ఇంటి పాత సంప్రదాయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా పరస్పర గౌరవం ఉంటే ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

బయటి వ్యక్తుల దగ్గర ఓపెన్ అవ్వడం..

కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న విషయాలను లేదా మనస్పర్థలను బయటి వ్యక్తుల వద్ద, బంధువుల వద్ద చర్చించడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కోడలు తన పుట్టింటికి వెళ్లినప్పుడు కూడా ఇంట్లోని విషయాలను బయట పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత పెద్దవిగా మారుతాయి. ఎప్పుడైనా సమస్యలు వస్తే వాటిని ఇంట్లోనే ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

ఇది కూడా చదవండి   జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !
 

సహకారం..

ఇద్దరి మధ్య మంచి సహకారం ఉండటం ఎంతో ముఖ్యం. ఏ బంధంలోనైనా ఇద్దరి అంచనాలు స్పష్టంగా లేనప్పుడు అపార్ధాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి పనులు, బాధ్యతలు , ఇతర విషయాల గురించి ఒకరికొకరు తోడుగా ఉంటూ పనులను పంచుకోవాలి. అత్తగారు కొత్తగా వచ్చిన కోడలికి విషయాలు నేర్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళితే ఆ ఇంటిలో ఎప్పుడూ నవ్వులు , సంతోషానికి లోటు ఉండదు. అత్తాకోడళ్ల మధ్య కూడా గొడవలు అనేవి చాలా వరకు రావు.. ఒకవేళ వచ్చినా పై మార్గాలు ఫాలో అవుతూ ఉంటే అవన్నీ

                                                                                                                                            *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు  రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!