రూ. 32 లక్షల క్యాష్ డిపాజిట్ పై ఐటీ విచారణ: ITAT సంచలన తీర్పు!
Published on: Mon Sep 7, 2026 11:50AM

బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినప్పుడు ఇన్ కమ్ టాక్స్ శాఖ దృష్టి పడటం సర్వసాధారణం. అయితే ఆ నగదు ఎక్కడి నుండి వచ్చిందో సరైన ఆధారాలు చూపించకపోతే పన్ను నోటీసులు, అదనపు పన్ను భారం తప్పవు. ఇటీవల ఇన్ కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) పనాజీ బెంచ్ ఇచ్చిన ఒక సంచలన తీర్పు ప్రతీ పన్ను చెల్లింపుదారుడికి ఎంతో కీలకమైన పాఠాన్ని నేర్పుతోంది. 2016 డీమోనిటైజేషన్ సమయంలో సిండికేట్ బ్యాంకు ఖాతాలో ఏకంగా 32 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేసిన ఒక మహిళా వ్యాపారి కథ ఇది. బంగారం తయారీ మరియు విక్రయాల వ్యాపారంలో ఉన్న సదరు మహిళ, 2016 నవంబర్ 10న రూ. 32 లక్షల డిపాజిట్ చేశారు. ఇన్ కమ్ టాక్స్ విచారణ సమయంలో ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను ఆమె సమర్పించారు. అసెస్సింగ్ ఆఫీసర్ ఆమె సమర్పించిన వివరాలలో రూ. 12.84 లక్షలను మాత్రమే చట్టబద్ధమైనవిగా అంగీకరించారు. ఇందులో ఆమె వద్ద ఉన్న రూ. 4.66 లక్షల ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్, రూ. 6.51 లక్షల బంగారు ఆభరణాల అమ్మకాలు, మరియు రూ. 1.67 లక్షల పిగ్మీ డిపాజిట్ మెచ్యూరిటీ సొమ్ము ఉన్నాయి. అయితే, మిగిలిన రూ. 19.15 లక్షల నగదుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఇన్ కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 69A కింద ఆదాయానికి అదనంగా చేర్చారు. దీంతో ఆమె డిక్లేర్ చేసిన రూ. 4.94 లక్షల ఆదాయం కాస్తా ఏకంగా రూ. 24.09 లక్షలుగా మారి పన్ను భారం పెరిగింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె మొదటి అప్పీలేట్ అథారిటీ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ (అప్పీల్స్) ని ఆశ్రయించారు. అక్కడ ఆమెకు కొంత ఉపశమనం లభించి రూ. 7.95 లక్షల అదనపు ఆదాయాన్ని తొలగించారు. కానీ ఇంకా రూ. 11.21 లక్షల భారం కొనసాగడంతో ఆమె ITAT పనాజీ బెంచ్ ని ఆశ్రయించారు. విచారణలో భాగంగా, తన అత్తగారు దిల్షాద్ దఫేదార్ విక్రయించిన రూ. 9.51 లక్షల విలువై న బంగారు ఆభరణాల సొమ్ము కూడా ఈ డిపాజిట్ లో ఉందని ఆమె వాదించారు. ఆ లావాదేవీకి సంబంధించి అత్తగారి కన్ఫర్మేషన్ పత్రాలను ఆధారంగా సమర్పించారు. ట్రిబ్యునల్ ఈ ఆధారాలను పరిశీలించి, అత్తగారి బంగారం విక్రయం నిజమైనదేనని గుర్తించి, దానికి సంబంధించిన రూ. 2.84 లక్షల మొత్తం పన్ను మినహాయింపునకు అర్హమైనదని తీర్పునిచ్చింది. 2026 సెప్టెంబర్ 3న వెలువడిన ఈ ఉత్తర్వు ద్వారా బాధితురాలికి మరో రూ. 2.84 లక్షల అదనపు ఊరట లభించింది.
itat ruling proof of money source cash deposit,income tax scrutiny 32 lakh bank deposit.


