TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియాలో మొట్టమొదటి అమెరికా యూనివర్శిటీ: ఎక్కడ ఏర్పాటు కానుందో తెలుసా.?

Published on: Thu Oct 8, 2026 2:37PM

దేశంలోనే తొట్టతొలి అమెరికా యూనివర్సిటీ హైదరాబాద్ లో ఏర్పాటు కానుంది. యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్.. హైదరాబాద్ లో డిగ్రీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైంది. దేశ ఉన్నత విద్యారంగంలో ఇదో కీలక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. ఇండియాలో తన క్యాంపస్‌ను స్థాపించడానికి సీయూ డెన్వర్, యూజీసీ  నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.  

ఈ వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు,  నియంత్రణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ విశ్వవిద్యాలయం  వచ్చే ఏడాది ఆగస్టులో తన మొదటి బ్యాచ్ విద్యార్థులను స్వాగతించడానికి ప్రణాళిక వేస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌ను ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి చురుకుగా కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరుపుతూ, తెలంగాణలో వాటి క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎంఐటీ,  పర్డ్యూ  వంటి సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా సీయూ డెన్వర్ అభివృద్ధి రాష్ట్రం   విస్తృత గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రయత్నంలో ఒక భాగంగా నిలుస్తుందని అంటున్నారు. 

హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభంలో, ప్రాక్టికల్ లెర్నింగ్ మరియు పరిశ్రమ అవసరాలపై దృష్టి సారించి, బిజినెస్, కంప్యూటింగ్, ఇంజనీరింగ్,  అనలిటిక్స్ వంటి రంగాలలో కోర్సులను అందిస్తుంది. ఈ వర్సిటీ ఏర్పాటు.. హైదరాబాద్ లో విద్యావ్యవస్థ పురోగతిని ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.  

[1st American University in Hyderabad,  American University, University of Colorado Denver, CU Denver Hyderabad, UGC, Telangana Education, Foreign University India, Hyderabad Education Hub, Telugu One]