కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.!
Published on: Mon Aug 24, 2026 11:46AM
.webp)
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో మరో ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్.. ఓ వ్యాపారవేత్తను బెదిరించి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారవేత్తపై ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
దీంతో సుమంత్ పరారయ్యారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు తెల్లాపూర్ లోని సుమంత్ ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా కే ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మార్టూరుకు వెళ్లి అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన సుమంత్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
Three more arrested, Konda Surekha former osd case, TaskForce, Attempt tp murder, Sumanth


