TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావుకు అస్వస్థత.!

Published on: Tue Aug 25, 2026 3:23PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై స్ఫృహ తప్పి పడిపోయారు.  విద్యార్థుల హక్కులు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల డిమాండ్ తో  రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాంపల్లి పరిసరాల్లో ఒక్క సారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ ఆందోళన సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు.  దీంతో ఇరువర్గాల మధ్యా తోపులాట మొదలైంది.  అదే సమయంలో నిరసన వేదిక వద్ద ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  అస్వస్థతకు గురయ్యారు.  

ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న పార్టీ నాయకులు, భద్రతా సిబ్బంది వెంటనే  ఆయనను పట్టుకుని కిందపడకుండా కాపాడారు. వెంటనే ఆయనకు మంచినీళ్లు అందించి ప్రథమ చికిత్స అందించిన  వాహనంలోకి తరలించారు.ఈ  ఘటనతో నాంపల్లి ప్రాంతంలో ఉద్రిక్తత  తమ నాయకుడు అస్వస్థతకు గురవ్వడానికి పోలీసుల అతి కారణమని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం మానేసి, ప్రశ్నించే ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 Telangana BJP President Ramchander Rao ill, Nampally protest tension, Fee reimbursement protest, Telangana political news