వివేకా హత్య కేసు.. జగన్ అనుచరుడ్ని విచారిస్తున్న సిట్

 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. వైఎస్ జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని పోలీసులు రెండు సార్లు విచారించారు. అదేవిధంగా పులివెందులకు చెందిన నాగప్ప, ఆయన కుమారుడు శివను కూడా సిట్ బృందం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.

ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల కోణంలో సిట్‌ విచారణ జరుపుతోంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి అనే వారు సూత్రధారులైతే.. పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారించారు. సోమవారం లోపల కొందరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.