TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు.. జోగి వ్యాఖ్యలకు మేఘన రిటార్డ్.!

Published on: Tue Aug 25, 2026 3:56PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ కుటుంబంలో విభేదాలు, వివాదాలు రోజు రోజుకూ తీవ్రమౌతున్నాయి. జోగిరమేష్ కోడలు మేఘన.. తనను భర్త ోగి రాజీవ్, అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జోగి కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన సంగతి  ఈ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్.. తాము కోడలిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నామని, కూతురిలా భావించి గోరుముద్దలు తినిపించామని వ్యాఖ్యానించారు.

అయితే, జోగి రమేష్ వ్యాఖ్యలను  మేఘన ఓ రేంజ్ లో తిప్పి కొట్టారు. తన అత్తింట్లో వారు తనకు  గోరుముద్దలు కాదు విషము ముద్దలు తినిపించి చిత్రహింసలకు గురిచేశారని మీడియా సమావేశంలో ఆరోపించారు.  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో భేటీ అయిన తరువాత  తాను అత్తమామలపై   పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను తాను కలవడం నిజమేనని, తన కుటుంబ సమస్య పరిష్కారం కోసం ఆయనతో మాట్లాడననీ వివరించారు.   వసంతకృష్ణ ప్రసాద్ ను కలవడానికి ముందు తాను వైసీపీ అధినేత జగన్  దృష్టికి  తన సమస్యను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తనకు ఆయనను   కలిసేందుకు అవకాశం లభించలేదన్నారు. దీంతో న్యాయం కోసం   పోలీసులను ఆశ్రయించానని మేఘన చెప్పారు. 

ఈ సందర్భంగా మేఘన  పెళ్లయిన నాటి నుంచి తనను ఇంట్లో ఏ విధంగా వేధించారో మీడియాకు వివరించారు. అత్త శకుంతల..  పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకొస్తేనే ఈ ఇంట్లో సంతోషంగా ఉంటావని తనపై ఒత్తిడి తెచ్చారని,  దాంపత్య జీవితంలో సమస్యలు రాకముందే, పెళ్లయిన కేవలం రెండు నెలలకే భర్త రాజీవ్ కోర్టులో పిటిషన్ వేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆమె ప్రశ్నించారు. పెళ్లికి ముందే తన భర్త రాజీవ్ ఉన్న శారీరక లోపాలను, ఆరోగ్య సమస్యలను పూర్తిగా దాచిపెట్టి మోసపూరితంగా ఈ వివాహం చేశారని ఆరోపించారు. వైద్య చికిత్స చేయిస్తామనే నెపంతో తనను బలవంతంగా పుట్టింటికి పంపించివేశారని మేఘన చెప్పారు.

ఇక కుటుంబ విశ్వాసాలు, నమ్మకాల విషయంలోనూ తమను తీవ్రంగా మోసం చేశారని మేఘన పేర్కొన్నారు. సంబంధం మాట్లాడేటప్పుడు తాము హిందూ సాంప్రదాయాలను పాటిస్తామని చెప్పి పెళ్లి చేశారని, కానీ వివాహం పూర్తయిన తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని వివరించారు. జోగి రమేష్ నివాసంలో అసలు పూజ గది కూడా లేదని, దీనికి సంబంధించి తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మేఘన మీడియాకు తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలను ప్రజల ముందు, న్యాయస్థానం ముందు బయటపెడతానని స్పష్టం చేశారు. 

తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను ఏ తప్పూ చేయకుండా అను నిత్యం శిక్ష అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసిన మేఘన..  ఏడాది కాలంగా ఈ వేధింపులు భరించలేక మనోవేదనతో కుమిలిపోతున్నానని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా, న్యాయపరంగా అంతిమ విజయం సాధించే   తన పోరాటం ఆపేది లేదన్నారు.   అదలా ఉండగా.. ఈ వివాదం వైసీపీలో కూడా  చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కోడలు నేరుగా పోలీసులను ఆశ్రయించడం, అలాగే అధికార ప్రతిపక్ష నేతలతో మాట్లాడటం వంటి పరిణామాలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. అయితే, ఇది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కావడంతో, దీనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే ధోరణిలో వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తున్నది.   

 Meghana strong counter to Jogi Ramesh, Jogi Rajiv, Allegations, Ibrahimpatnam Police Station, YCP Controversies, Jogi Family Dispute