Medipalli: ఐదు నిమిషాల్లో రూ.2 కోట్ల ఆభరణాలు చోరీ.!
Published on: Mon Oct 5, 2026 1:17PM

కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు. తెల్లవారు జామున చడి చప్పుడు కాకుండా షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చేతికి అందినంతగా దోచుకుని.. ఎలాంటి హడావుడి లేకుండా మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యారు. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారు , వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌ను దుండగులు టార్గెట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4:10 గంటల సమయంలో షట్టర్‌ను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు.. అక్కడ ఉన్న గ్లాస్‌ను పగలగొట్ట కుండా ఎంతో చాకచక్యం గా ఓపెన్ చేశారు.

అనంతరం వజ్రాభరణా లను ఒక్కొక్కటిగా బయటకు తీసి బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా పరారైనట్లు తెలుస్తోంది. ఈ చోరీలో ఏకంగా రూ.2 కోట్లకు పైగా విలువైనబంగారు ,డైమండ్ నగలు అపహరణకు గురైనట్లు సమాచారం. అయితే చోరీ జరిగిన విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో బిల్డింగ్ యజమాని షాప్ షట్టర్ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి పరిశీలించగా దొంగలు పడ్డట్లు గుర్తించాడు. వెంటనే బ్రాంచ్ అధికారికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. బ్రాంచ్ అధికారి వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దిగి దుండగులకు సంబం ధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగుల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నా రు. మరోవైపు చోరీ జరిగిన సమయంలో దుండగులు ఏ మార్గంలో వచ్చారు? చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు? ముందస్తు సమాచారంతో చోరీకి పాల్పడ్డారా? లేక జ్యువెలరీ షాప్‌ను రెక్కీ చేసి మరీ టార్గెట్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో వజ్రాభరణాలు చోరీకి గురికావడంతో ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. నిందితు లను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
ఐదు నిమిషాల్లో రూ.2 కోట్ల ఆభరణాల చోరీ.!
క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగినట్లుగా సమాచారం అందడంతో డిసిపి సురేష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ... ఈ షో రూమ్ లో మొత్తం ఏడుగురు దుండగులు కలిసి చోరీ చేసినట్లుగా గుర్తించామని డీసీపీ సురేష్ రెడ్డి తెలిపారు. వీరిలో కేవలం ఒక్కరు మాత్రమే షోరూం లోపలికి వెళ్లగా.. మిగతా ఆరుగురు బయటే వేచి ఉన్నారు. పక్కా ప్రణాళికతో వచ్చిన ముఠా.. కేవలం ఐదు నిమిషాల్లోనే చోరీని పూర్తి చేసింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఐదు నిమిషాల తర్వాత మరోసారి డోర్ ఓపెన్ చేస్తే అలారం మోగుతుందని ముందే తెలిసిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని డీసీపీ తెలిపారు. దీంతో షోరూం భద్రతా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఈ ముఠాకు కీలకం గా వ్యవహరించినట్లు తెలుస్తోందన్నారు. చోరీలో పాల్గొన్న ఏడుగురు రాజస్థాన్‌కు చెందిన ముఠా అయి ఉండొచ్చని డీసీపీ సురేష్ రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ వెల్లడించారు
.webp)
[ Massive theft in Medipalli, Carat Lane Diamonds Jewellery Shop, Hyderabad, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, CP Sajjanar, Hyderabad police, DCP Suresh Reddy, Telugu One, Telugu News ]


