TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్: లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నేతలు.!

Published on: Tue Oct 20, 2026 3:10PM

మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, ఆయన సతీమణి దామర్ల లక్ష్మీనారాయణి, పెద్ద కుమారుడు దామర్ల రాజీవ్, కోడలు శ్రీమతి రాజ్యలక్ష్మీ, చిన్న కుమారుడు దామర్ల రవికాంత్ తో పాటు బిట్రా శేషాంజనేయులు, బిట్రా శ్రీనివాసరావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘం ఉపాధ్యక్షులు తోలేటి రవీంద్రతో పాటు ఒక కుటుంబం, దుగ్గిరాల మండల వైసీపీ సీనియర్ నేత షేక్ అబ్దుల్ సలాంతో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. 

ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దామర్ల కుబేరస్వామి ప్రస్తుతం మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం కార్యదర్శిగా, మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ సంఘం ఉపాధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల కమిటీ సభ్యులుగా పనిచేశారు. దామర్ల కుబేరస్వామి తాతగారు దామర్ల రామకాంతరావు గారు ఎమ్మెల్సీగా, టీటీడీ బోర్డు మెంబర్ గా, ఆప్కో వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఆశీర్వదించండి.!

ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. రెండున్నరేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తున్నాం. నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తాం. దుగ్గిరాలలో రోడ్లు, షాదీఖానాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. అదే స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలి. కూటమి అభ్యర్థులను మంచి మెజార్టీతో ఆశీర్వదించాలి. 

ఇదే నాకు కొండంత బలం. నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటానని, కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

[ Mangalagiri, YSCP Leaders Join TDP, Nara Lokesh, TDP, YSRCP, Mangalagiri Politics, Damarla Kuber Swamy, TDP Membership, Andhra Pradesh Politics, Duggirala, Local Body Elections, TDP Leaders, Political Defections, Mangalagiri Development, Nara Lokesh Meeting, Telugu Desam Party, YSRCP Leaders Join TDP ]