మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాల చోరీ.. నలుగురు అరెస్ట్..!
Published on: Fri Sep 11, 2026 12:08PM

చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. ఈ కేసులో మద్రాస్ రెజిమెంట్ నుంచి రిటైర్ అయిన ఓ ఆర్మీ అధికారి కీలక సూత్రధారిగా ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. చోరీకి సంబంధించిన ఆయుధాలను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లోని రిటైర్డ్ ఆర్మీ అధికారి నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ విశ్రాంత ఆర్మీ అధికారి పాత్రపై దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ చోరీ సాధారణ దొంగతనం కాదన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. మద్రాస్ రెజిమెంట్‌లోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఆయుధాలు బయటకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. మద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్‌చార్జి సహకారంతోనే ఆయుధాల చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సైనికులకు బుల్లెట్లు అందించే అమ్యునిషన్ సెక్షన్ ఇన్‌చార్జి కూడా ఈ వ్యవహారంలో సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అంటే.. రెజిమెంట్‌లోని ఆయుధాల నిల్వ, వాటి కదలికలు, బుల్లెట్లకు సంబంధించిన వివరాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతోనే ఈ చోరీకి పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి సూత్రధారిగా వ్యవహరించగా.. రెజిమెంట్‌లోని కొందరి సహకారంతో ఆయుధాలు బయటకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందా? వాటిని ఎవరికి విక్రయిం చేందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతున్నది.

ఈ కేసులో నలుగురు పట్టుబడటంతో దర్యా ప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, బుల్లెట్లకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బొల్లారం నుంచి ప్రారంభమైన ఈ ఆయుధాల చోరీ కేసు.. ఇప్పుడు మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ వరకు విస్తరించడం, రిటైర్డ్ ఆర్మీ అధికారి పేరు తెరపైకి రావడం, అంతేకాకుండా రెజిమెంట్‌లోని కీలక విభాగాల సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలు రావడం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది.
[ Madras Army Regiment, Weapons theft case, Bollaram, Retired Army Officer, Mahabub Nagar, Nagarkurnool, Crime news, Minister Rajnath Singh,Telugu One, Telugu News ]


