జగన్ హయాంలో సామ్రాజ్యంగా విస్తరించిన మతమార్పిడి నెట్ వర్క్.. విజయసాయి.!
Published on: Mon Aug 24, 2026 3:37PM
.webp)
నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి.. ఇప్పుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిడులు జరిగాయనీ, లవ్ జిహాద్ పేర పెద్ద ఎత్తున అమాయకులను మోసం చేశారనీ విమర్శలు గుప్పించారు. కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి రెడ్డి కోనసీమలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో మత మార్పిడులను విపరీతంగా ప్రోత్సహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక మతమార్పిడి కుట్ర దాగి ఉందన్న విజయసాయి అందుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ హయాం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో లవ్ జిహాద్, అక్రమ మత మార్పిడుల నెట్‌వర్క్ క్రియాశీలకంగా మారాయన్న ఆయన.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతోనే సాదిక్ ఖాన్ లాంటి కరడుగట్టిన నేరస్థులు రెచ్చిపోయారన్నారు. అమాయక హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేశారని విమర్శించారు.
ఈ అక్రమ మత మార్పిడి ముఠా కేవలం మతం మార్చడమే కాకుండా, బాధితుల ఆస్తులను అక్రమంగా కాజేసిందన్నారు. రావులపాలెంలో ఏఈ నూకరాజుకు చెందిన దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన భూములను సాదిక్ ఖాన్ దౌర్జన్యంగా తన పేరు మీద రాయించుకున్నాడని తెలిపారు. 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కోల్పోవడం, మరోవైపు నిరంతరం సాగిన మానసిక వేధింపులు తాళలేకే నూకరాజు తన కుటుంబంతో బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ మత మార్పిడి నెట్‌వర్క్ ఒక సామ్రాజ్యంగా విస్తరించిందనీ.. బాధితుల వెతలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా, పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు నేరుగా జగన్ పాలనలోనే బలవంతపు మతమార్పిడులు జరిగాయనీ, లవ్ జిహాద్ పేరిట భూదందాలు సాగాయంటే విమర్శల దాడి చేయడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. బాధితులకు న్యాయం జరగాలని, ఈ మత మార్పిడి కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Love Jihad in Ap, Jagan Tenure, Vijayasai Reddy comments, Jagan conversion allegations, AE Nookaraju suicide case,Andhra Pradesh politics, Vijayasai Reddy press meet


