మీడియా ముందు భోరుమన్న కొండా సుశ్మిత
Published on: Sun Sep 6, 2026 1:58PM

రేవంత్ తన కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడంపై తొలి సారిగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మిత మీడియా ముందు భోరు మన్నారు. తన తల్లి మంత్రి పదవి పోవడానికి తానే కారణమంటో విలపించారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా కొండా సురేఖ కుటుంబం తీరు ఉందనిఎద్దేవా చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మీత విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సవాల్ విసిరారు. ఆమె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు.
దీనిపై కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని, కానీ న తల్లిని టార్గెట్ చేయడం బాధాకరమని సుస్మిత మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.
.webp)
అయితే కిందపడ్డా నాదే పై చేయి అన్నచందంగా.. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాని చెప్పుకొచ్చారు. వాస్తవానికి సుశ్మీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ కనీసం ఖండిచకపోవడాన్ని మాత్రం సుశ్మీత ఈ సందర్భంగా విస్మరించారు. ఇక పోతే కొండా సుశ్మిత వ్యాఖ్యలు పార్టీని బహిరంగంగా సవాల్ చేశాయనీ, పార్టీలో అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా.. బహిరంగంగా నాయకత్వాన్ని సవాల్ చేయడమే కొండా సురేఖపై వేటుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటువంటి సుశ్మిత తన తల్లిపై చర్య తీసుకోవడం దారుణమంటూ ఇప్పుడు విలపించి ప్రయోజనం లేదని అంటున్నారు.
[Konda Susmitha Tears Bedore Media, Konda Surekha, Revanth Reddy, Telangana Congress, Cabinet dismissal, Telugu One]


