200 కార్ల భారీ కాన్వాయ్‌తో కొడంగల్‌కు కల్వకుంట్ల కవిత..!
Published on: Sun Sep 20, 2026 2:20PM
.webp)
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కోస్గిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి ఆమె భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. సుమారు 200 కార్లతో భారీ కాన్వాయ్ కొనసాగుతోంది. హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ వద్ద కవితకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని కవితకు స్వాగతం పలికారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సభలో తెలంగాణ రక్షణ సేన భవిష్యత్ కార్యాచరణ, పార్టీ విధానాలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై కవిత తన రాజకీయ దిశను వివరించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించాలని కవిత గతంలో ప్రకటించారు. ఈ సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.

తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును ఆమోదించిన తర్వాత కవిత చేపడుతున్న రాజకీయ కార్యక్రమాల్లో కొడంగల్ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే నిజామాబాద్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన, తదుపరి దశలో కొడంగల్–కోస్గి కేంద్రంగా పార్టీ కార్యకలా పాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అనంతరం అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా మరో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో పార్టీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోస్గి సభకు భారీగా పార్టీ శ్రేణులు తరలివస్తుండటంతో కొడంగల్‌లో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
[ Kalvakuntla Kavitha to Kodangal, TRS, Telangana Rakshana Sena, Kosgi, CM Revanth reddy, KCR, KTR,BRS Party, Telugu One, Telugu News, Panchajanya Sankalpa Sabha, Indravelli ]


