TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పాదయాత్ర..ముహూర్తం మారింది.!?

Published on: Thu Sep 10, 2026 10:19AM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జరపతలపెట్టిన పాదయాత్ర ముహూర్తం విషయంలో ఒక నిర్ణయానికి రావడంలో మల్లగుల్లాలు పడుతున్నారు. వారం రొజులకు ముందు జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది జులై 8 నుంచి ప్రారంభించనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోయినా, ఆ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం అని మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని ఖండించలేదు. అలా ఖండించకపోవడంతో వైఎస్ జయంతి అయిన జులై 8 నుంచే జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారన్నది దాదాపు ఖారరైపోయినట్లేనని పరిశీలకులు కూడా విశ్లేషణలు చేశారు. 

అయితేఇప్పుడు తాజాగా జగన్ తన పాదయాత్ర జూలై 8 నుంచి ప్రారంభించడానికి సుముఖంగా లేరని చెబుతున్నారు.  తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో  ఇటీవల పార్టీ నేతలతో జరిగిన   భేటీలో జగన్ స్వయంగా తన పాదయాత్ర  క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ లలో  పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రారంభమయ్యే తన పాదయాత్ర ఎన్నికల వరకూ సాగుతుందని ఆయన చెప్పారు.  తండ్రి వర్థంతి, జయంతి వంటి తేదీలకు తన రాజకీయ పాదయాత్రకు ముడిపెట్టడం సరికాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

2019లో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల కాలంలో ప్రజలకు దూరమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్న జగన్.. ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి    పాదయాత్ర ద్వారా మళ్లీ ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని చూరగొనాలని భావిస్తున్నారు.   2029 ఎన్నికలే లక్ష్యంగా సాగే ఈ పాదయాత్ర విషయంలో ఎప్పటి నుంచి ప్రారంభించాలి, రూట్ మ్యాప్ ఏమిటి? అన్న దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  అయితే ముందుగా నిర్ణయించుకున్నట్లుగా లేదా ప్రచారం జరిగినట్లు జులై8 నుంచి జగన్ తన పాదయాత్రను ఎందుకు ఆరంభించడంలేదన్న చర్చ నెట్టింట మొలైంది. తండ్రి ముద్ర లేకుండా తాను స్వంతంగా ప్రజలకు చేరువ కావాలన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే..   గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా జగన్ కు దక్కిన ప్రజాదరణ, ప్రజా విశ్వాసం ఈ పారి దక్కుతుందా అన్నది అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 [Jagan Padayatra Date Changed,YSJagan Mohan Reddy Padayatra, Andhra Pradesh Politics, YSR Jayanti, Telugu One]