TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గురువాయూరప్ప సన్నిధిలో పవన్ కళ్యాణ్.. వేకువజామునే ప్రత్యేక సేవలు..!

Published on: Sat Sep 12, 2026 11:24AM

కేరళలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామివారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  దర్శించు కున్నారు. వేకువజామున ఆలయంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన నిర్మాల్య దర్శనంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శనివారం తెల్లవా రుజామున సుమారు 3 గంటలకు గురువాయూర్ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దక్షిణ ముఖద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ఆయన.. దాదాపు 30 నిమిషాలపాటు నిర్మాల్య సేవలో పాల్గొన్నారు. 

ముందురోజు స్వామివారికి చేసిన అలంకరణతో నిర్వహించే తొలి దర్శ నాన్ని నిర్మాల్య దర్శనంగా పిలుస్తారు. ఈ సందర్భం గా గర్భాలయంలో మూల విరాట్టుకు నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలను పవన్ కళ్యాణ్  భక్తిశ్రద్ధ లతో తిలకించారు. నిర్మాల్య దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. స్వామివారికి ముందు రోజు అలంక రించిన గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే విశిష్ట సేవ గురించి ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ బాలకృష్ణ స్వామివారికి పవన్ కళ్యాణ్  పట్టువస్త్రాలు సమర్పించారు. 

అనంతరం నైరుతి దిశలో ఉన్న వినాయకు డిని  దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఆలయ ఆచారాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఆంజనే యస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయ ప్రదక్షిణలో భాగంగా శ్రీ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం గురువాయూర్ మేల్ శాంతితో పాటు ఇతర ప్రధాన అర్చకులు డిప్యూటీ సీఎం ని ఆశీర్వదించారు. స్వామివారి కళభం, ఇతర ప్రసాదాలను అందజేశారు. పవన్ కళ్యాణ్ కి ఆయుర్వేద థెరపీ అందించిన వైద్యులు కూడా డిప్యూటీ సీఎంతో పాటు గురువా యూర్ శ్రీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.

 

 

 

[ Guruvayur Sri Balakrishna Swamy, Kerala, Deputy CM Pawan Kalyan,  Guruvayur, AP Govermnet, Jana Sena Party, Telugu One, Telugu News ]