కొవ్వూరు స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!
Published on: Fri Sep 11, 2026 10:31AM

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలును తిరిగి పట్టాలపైకి తీసుకువచ్చేం దుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాక్‌పై మరమ్మతు పనులను చేపట్టారు. రైల్వే సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తు న్నారు. మరమ్మతు పనులు పూర్తయిన అనంతరం రైళ్ల రాకపోక లను సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశం ఉంది. గూడ్స్ రైలు ఏ కారణంగా పట్టాలు తప్పిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

[ Goods train derails at Kovvur station, East Godavari District, Indian railways, SCR, Kovvur Railway Station, PM MODI, Railw Minister Ashwini Vaishnaw ]


