TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Fortune 99 Homes: నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డి అరెస్ట్.!

Published on: Mon Oct 5, 2026 3:03PM

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోగస్ పత్రాలతో ప్లాట్ల విక్రయాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. జడ్చర్లలో ప్లాట్ ఇప్పిస్తానంటూ ఓ బాధితురాలి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు తీసుకున్న తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా రోసిరెడ్డి తప్పించుకోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. 

ఆ స్థలం గురించి ఆరా తీయగా.. సదరు భూమిపై రోసిరెడ్డికి ఎలాంటి హక్కులు లేవని తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అప్పటికే రోసిరెడ్డి తన కార్యాలయాన్ని మూసివేసి పరారైనట్లు గుర్తించారు. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు తాజాగా పట్టుకుని అరెస్ట్ చేశారు.మరోవైపు రోసిరెడ్డిపై గతంలోనూ పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీసీఎస్, జూబ్లీహిల్స్ సహా ఇతర పోలీస్ స్టేషన్లలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా రోసిరెడ్డి చేతిలో మోసపోయిన బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ప్లాట్ల విక్రయాలు, వసూళ్లపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు భూమి యాజమాన్య హక్కులు, అనుమతులు, పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను పూర్తిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

 

 

 

[ Fortune 99 Homes, Madirala Rosireddy, Real Estate Fraud, Banjara Hills Police, Hyderabad Real Estate Scam, Plot Fraud, Land Scam, Rs 25 Lakh Fraud, Cheating Case, Fake Documents, Real Estate Scam, Jadcherla Land, Hyderabad Crime, Telangana Real Estate, Fraud Case ]