TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లింట పెను విషాదం.. అగ్ని ప్రమాదంలో 22 మంది మృతి.!

Published on: Sun Sep 6, 2026 12:28PM

పెళ్లింట సంభవించిన అగ్నిప్రమాదంలో 22 మంది మరణించిన ఘటన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది. కాంగో రాజధాని  కిన్షాసాలో ఒ ఒక వివాహ వేడుకలో  సంభవించిన అగ్ని ప్రమాదంలో  22 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమఃతోంది. 

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది, స్థానికులు   సహాయక చర్యలు చేపట్టారు. భవనం లోపల చిక్కుకున్న క్షతగాత్రులను, మృతదేహాలను అతికష్టమ్మీద బయటకు తీశారు.  

క్షతగాత్రులను మె చికిత్స కోసం కిన్షాసాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.  ఘటనా స్థలాన్ని కాంగో ఉప ప్రధాని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.   అగ్నిప్రమాదానికి గల అసలు కారణం ఏమిటనే దానిపై  స్పష్టత రావాల్సి ఉంది.    షార్ట్ సర్క్యూట్ కారణంగా . ఈ కోణంలోనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

కిన్షాసా నగరంలో జనాభా ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాలలో తగినంత అగ్నిమాపక రక్షణ సౌకర్యాలు లేకపోవడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ఘోర ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని స్థానికులు వాపోతున్నారు.

ముఖ్యంగా ఎండాకాలం లేదా పొడి వాతావరణం ఉండే సీజన్లలో ఈ రకమైన అగ్నిప్రమాసాలు ఎక్కువవుతున్నాయని స్థానిక మీడియా చెబుతోంది. పెళ్లింట నూరేళ్ల ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని దీవించాల్సిన బంధుమిత్రులు, ఇలా విధి ఆడిన వింత నాటకంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో కిన్షాసా ప్రాంతమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.


 [Fire In Congo wedding, Kinshasa fire accident, , 22 killed in fire, wedding venue blaze, Telugu One]