ఏపీ స్థానిక పోరులో ఊహించని పరిణామం.. చీరాలలో కాంగ్రెస్ సంచలన విజయం.!
Published on: Fri Nov 6, 2026 7:13PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థులు తమ సత్తా చాటారు. నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పోటీని ఇస్తూ కీలక స్థానాలను కైవసం చేసుకున్నారు.
ముఖ్యంగా చీరాల పరిధిలోని 1, 21, 25 మరియు 33వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ద్వారా స్థానిక రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుకున్నారు.గతంలో ఈ ప్రాంతంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన నాయకుల వ్యూహాలు, పార్టీ శ్రేణుల నిరంతర శ్రమ ఈ విజయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీన జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, రాష్ట్రంలో ఏర్పడిన తుఫాన్ వాతావరణం కారణంగా వాయిదా పడింది. నేడు ఉత్కంఠభరిత వాతావరణంలో కౌంటింగ్ కొనసాగుతోంది.స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమంచి కృష్ణమోహన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు, ఆయనకున్న వ్యక్తిగత పట్టు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ఎంతగానో దోహదపడినట్లు సమాచారం.

చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఈ స్థాయిలో ఫలితాలు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. భవిష్యత్తు ఎన్నికలకు ఇది మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ విజయాలు ఒక బలమైన పునాదిగా నిలుస్తాయని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
[ Congress sensational victory in Chirala, AP Municipal Elections, Congress Party Chirala, Aamanchi Krishna Mohan, AP Local Body Polls, TeluguOne News AP Politics, CM Chandrababu, Naralokesh, Y. S. Sharmila ]


