బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టు కోర్టు ధిక్కరణే.. కేటీఆర్ ఫైర్.!
Published on: Tue Sep 8, 2026 9:07AM
ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిల అరెస్టు కోర్టు ధిక్కరణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గడ్డం మధుసూదన్ ను, ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను ఖండిస్తూ.. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు విస్పష్టంగా ఆదేశవించినా, ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. ఎమ్మెల్సీల అరెస్టు కచ్చితంగా కోర్టు ధిక్కరణేనన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టుల పట్ల, చట్టం పట్ల ఇసుమంతైనా గౌరవం లేదని విమర్శించారు.
1000 రోజుల పాలనలో రేవంత్ సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వాగ్దానాల అమలులో విఫలం కావడమే కాకుండా, దానిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేస్తోందని దుయ్యబట్టారు.
.webp)
ఇప్పుడైనా కాంగ్రెస్ సర్కార్ తన 420 హామీలను ఇప్పుడైనా అమలు చేస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం స్వచ్ఛందంగా అరెస్టౌతాం, అందుకు మీరు రెడీనా అంటూ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల చీరలు పట్టుకుని, మెడపై చేయివేసి దాడి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేదా అని ప్రశ్నించారు.
[BRS MLCs arrest Contempt Of Court, KTR, Congress government, Telangana Assembly, Revanth Reddy, Telangana Politics, Telugu One]


