ప్రేయసి పరీక్షలో ఫెయిలయిందని.. ఏకంగా స్కూల్‌కే నిప్పు పెట్టిన ప్రియుడు.!
Published on: Tue Oct 27, 2026 4:30PM

ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో కొంతమంది చేసే పిచ్చి పనులు చూస్తే వీళ్లకు ఏకంగా మైండ్ బ్లాంక్ కావడం ఖాయం అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి కోవకే చెందిన ఓ విచిత్రమైన, షాకింగ్ ఘటన ఈజిప్ట్ దేశంలో వెలుగు చూసింది. సాధారణంగా పరీక్షల్లో ఫెయిల్ అయితే స్టూడెంట్స్ తీవ్రంగా బాధపడతారు, లేదా వారి తల్లిదండ్రులు వారిని మందలిస్తారు. కానీ ఇక్కడ ప్రియురాలు పరీక్షల్లో తప్పిందని ఏకంగా ఓ యువకుడు కక్షగట్టి బడికే నిప్పు పెట్టిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఈజిప్ట్ దేశంలోని మెనోఫియా (Menoufia) గవర్నరేట్‌లో ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం జరిగిన పరీక్షల్లో ఆ యువకుడి కాబోయే భార్య అనగా ప్రియురాలు ఫెయిల్ అయినట్లు అతనికి తెలిసింది. ఈ వార్త విన్న ఆ యువకుడు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ప్రియురాలు ఫెయిల్ కావడానికి ఆమె చదువుకున్న పాఠశాల సిబ్బంది, అక్కడి విద్యా విధానమే కారణమని నమ్మాడు. తన ప్రేయసి ఫెయిల్ అయిందన్న కోపంతో రగిలిపోయిన ఆ ప్రియుడు.. ఏకంగా ఆ పాఠశాల భవనానికి నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రాత్రి సమయంలో ఆ స్కూల్ వద్దకు వెళ్లి భవనానికి నిప్పు అంటించాడు.
ఈ ప్రమాదంలో పాఠశాలలోని కొంత భాగం అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, అదృష్టవశాత్తు ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక అధికారులు తెలిపారు. పాఠశాలలో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీనివల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే భవనానికి జరిగిన ఆస్తి నష్టం వేల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

నిప్పు పెట్టిన తర్వాత ఆ యువకుడు అక్కడి నుండి తన సొంతూరికి పరారయ్యాడు. అయితే, స్కూల్ దగ్గరే అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఈజిప్ట్ పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలి కోసం బడికి నిప్పు పెట్టిన ఈ పిచ్చి ప్రేమికుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనను చూసిన నెటిజన్లు.. "అరే ఏంట్రా బాబు ఈ కిడ్స్ ఇలా ఉన్నారు, ప్రేమ పేరుతో ఇంతటి మూర్ఖపు పనులా" అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
[ boyfriend sets school on fire, girlfriend fails exam, Egypt news, dumbest criminals, bizarre news, school fire revenge, Telug One, Telugu News ]


