TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంచి మంచి కట్టుబాట్లు: ఎమ్మెల్యే కారు వాషింగ్ కోసం ఫైర్ ఇంజిన్.!

Published on: Wed Aug 26, 2026 5:55PM

 అగ్ని ప్రమాదాలు సంభవించిన సందర్భాలలో మనుషుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి ఉపయోగించాల్సిన ఫైర్ ఇంజన్ వాహనం ఒక ప్రజాప్రతినిధికి వ్యక్తిగత సర్వీసింగ్ కు ఉపయోగించడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే తన  కారు వాషింగ్ సర్వీస్ కోసం అగ్నిమాపక యంత్రాన్ని వినియోగించడం వివాదాస్పదంగా మారింది.    మధ్యప్రదేశ్   బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా   తన  కారును ఇంటి ముందు పార్క్ చేశారు. 

అయితే ఆ కారును శుభ్రం చేయడానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఫైర్ బ్రిగేడ్ వాహనాన్నిరప్పించి. ఆ ఫైర్ ఇంజిన్‌లో ఉన్న నీటిని హోస్ పైపు ద్వారా వేగంగా చల్లుతూ ముగ్గురు మున్సిపల్ సిబ్బంది ఎమ్మెల్యే కారును శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

నెటిజనులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అలాగే అగ్నిమాపక యంత్రంతో ఎమ్మెల్యే రామ్ నివాస్ జన బాహుల్యం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  ఎమ్మెల్యేకు, ఓ ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి  వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో కారును కడిగించుకునే స్థోమత లేదా అంటు నెటిజనులు ఓ రేంజ్ లో ప్రశ్నిస్తున్నారు.  ప్రజాప్రతినిధి అయ్యి ఉండీ ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ ఫైర్ బ్రిగేడ్‌ను ఇలా సొంతానికి వినియోగించుకోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ  మధ్యప్రదేశ్ ప్రభుత్వం గానీ, స్థానిక మున్సిపల్ అధికారులు గానీ,   సదరు బిజెపి ఎమ్మెల్యే రామ్ నివాస్ షా గానీ స్పందించలేదు.  

(BJP MLA Ram Niwas Shah, Fire Brigade Car Wash, Madhya Pradesh Viral Video, Singrauli BJP MLA, Government Vehicle Misuse, Innova Car Wash Fire Engine, Telugu News, Telugu One)