TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండ్లగూడలో దారుణ హత్య.. చంపింది ప్రాణస్నేహితుడే ..?

Published on: Tue Sep 15, 2026 1:02PM

నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సుప్రీమ్‌ వైన్స్‌ పర్మిట్‌ రూం వద్ద ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రౌడీషీటర్‌ మహమ్మద్‌ నయీమ్‌ను  గుర్తుతెలి యని వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. సోమవారం రాత్రి సుమారు 9:20 గంటల సమయంలో 5–6 మంది వ్యక్తులు నయీమ్‌ ను వెంటాడుతూ వచ్చారు వారి నుంచి తప్పించుకునేందుకు నయీమ్‌ సుప్రీమ్‌ వైన్స్‌ పర్మిట్‌ రూంలోకి వెళ్ళాడు. అయితే దుండగులు అతడిని చుట్టుముట్టి మద్యం బాటిళ్లు, వంట పాత్రలతో దాడి చేయడంతో పాటు వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నయీమ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు నయీమ్‌ ఇల్లందు పట్టణానికి చెందిన పాత నేరస్తుడు, రౌడీషీటర్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్స్‌ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఇల్లందుకు చెందిన రౌడీషీటర్లు ఉమా మహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేష్‌, మహమ్మద్‌ నయీమ్‌ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు.... అయితే సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా ఇద్దరి మధ్య వివాదాలు, ముఠా కక్షలు పెరిగిపోయాయి. ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు ఉండటంతో పాటు ఇల్లందు పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ పాత కక్షల నేపథ్యంలోనే మహేష్‌, తన అనుచరులతో కలిసి నయీమ్‌పై దాడి చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు అక్కడినుండి పారిపో యారు. ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి . నిందితుల కోసం నాగోల్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణాలు, నిందితుల పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

[ Bandlaguda Murder, Nayeem Murder, Mohammed Nayeem, Rowdy Sheeter Murder, Nagole Police, Hyderabad Crime, Bandlaguda Crime, Gang War, Old Faction Rivalry, Murder Case, CCTV Footage, Supreme Wines, Permit Room Murder, Hyderabad Police, Telangana Crime, Nayeem Murder Case, JK Mahesh, Gang Rivalry, Settlement Dispute, Hyderabad Murder ]