TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.!

Published on: Sun Nov 22, 2026 10:04AM

ఒకే వేదికపై రజనీకాంత్, స్టాలిన్.. లోకేష్ ఆప్యాయ పలకరింపులు.!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి రిసెప్షన్‌కు విచ్చేశారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ దంపతులు నూతన వధూవరులు అనిరుధ్, కావ్య మారన్‌లకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

రిసెప్షన్‌కు హాజరైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌లను నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్, లోకేష్‌తో ఆప్యాయంగా ముచ్చటించారు.

 ఇరువురూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ చిరునవ్వులు చిందించారు.అలాగే మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తోనూ నారా లోకేష్ కరచాలనం చేశారు. ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకలో లోకేష్ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ..31 కంపార్టుమెంట్లు ఫుల్.!
 

[ Anirudh-Kavya Maran wedding reception, Nara Lokesh, Anirudh Ravichander, Kavya Maran, Rajinikanth, MK Stalin, Brahmani, Udayanidhi Stalin, Chennai Reception ]