ఆరేళ్ల బాలుడి అరెస్టు.. బీహార్ లో సంచలనం.. అసలేంటి విషయం?
Published on: Sat Aug 29, 2026 12:06PM

బీహార్ పోలీసులు ఓ ఆరేళ్ల బాలుడిని అరెస్టు చేసిన సంఘటన దేశం మొత్తంలో సంచలనంగా మారింది. ఓ ఆరేళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేయడమేంటి? అని ముక్కున వేలేసుకుంది. ఆ తరువాత ఆ అరెస్టుకు కారణమేంటని నెట్టింట తెగ గాలించింది. అలా గాలించి అరెస్టుకు కారణం తెలుసుకుని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకూ జరిగిందేంటంటే..
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) వివాదంపై ఈ నెల25న బీహార్ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత నిరసన చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఇంటి వరకు జరిగిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అంతటి ఉద్రిక్తతల నడుమా ఓ ఆరేళ్ల బాలుడు.. ధైర్యంగా నిలబడ్డాడు. సీఎం సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలంటూ నిర్విరామంగా నినదించాడు.
చేతిలో జాతీయ జెండా పట్టుకుని ఆందోళనలో పాల్గొన్న ఆ ఆరేళ్ల బాలుడి పేరు ఆదిత్య కుమార్. చుట్టూ ఉద్రిక్తత, హింస, పోలీసుల లాఠీ చార్జీ, ఆందోళనలో పాల్గొన్న వారంతా పోలీసుల లాఠీల నుంచి తప్పించుకోవడానికి చెల్లా చెదురుగా పరుగులు తీస్తున్న ఆ బాలుడు మాత్రం ఇసుమంతైనా భయం లేకుండా సీఎం సామ్రాట్ చౌదరి రాజీనామా డిమాండ్ తో నినాదాలు చేస్తూ నిలబడ్డాడు. పోలీసులు ఆ బాలుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
అక్కడ కూడా ఆ కుర్రోడు నదురూ బెదురూ లేకుండా ప్రభుత్వంపై విమర్శలు, పోలీసుల లాఠీచార్జిపై ఖండనలతో చేసిన ప్రసంగం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తన భవిష్యత్తు కోసం తాను స్వచ్ఛందంగా ఈ ఆందోళనలో పాల్గొన్నానంటూ ఆరేళ్ల ఆదిత్య కుమారు విస్పష్టంగా చెప్పిన తీరు నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
పోలీసులు అతడిని, అతడితో పాటు అతని తల్లిదండ్రులనూ పోలీసు స్టేషన్ కు లాక్కొచ్చారు. ఆ ఆరేళ్ల బాలుడిని కొట్టారు. ఆ తరువాత పోలీసులు ఆ బాలుడిని సముదాయించడానికి చాక్లెట్లు ఇచ్చినా ఆదిత్య కుమార్ నిరాకరించారు. ఇక తమ కుమారుడిని పోలీసులు కొట్టారంటూ ఆరోపించిన ఆదిత్య కుమార్ తండ్రి తన బిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చేసిన డిమాండ్ ను పోలీసులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీంతో వ్యవహారం కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆవరణలో ఆరేళ్ల బాలుడు ఆదిత్య కుమార్ మీడియా ప్రశ్నలకు తడబాటు, తత్తరపాటు లేకుండా ధైర్యంగా సమాధానాలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు.
{6 year old Boy Arrest, Aditya Kumar 6 year old, Patna protest BPSC, Samrat Choudhary resignation, Bihar student movement, Patna police custody child, Telugu One}


