3 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టివేత...

 

రాజ‌స్థాన్‌లో అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదులు ఏకంగా 3వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను అధికారులు ఓ ఫ్యాక్ట‌రీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబ‌ర్ 28న మ‌రుధార్ డ్రింక్స్‌పై అధికారులు దాడి చేయ‌గా.. అందులో ఒక రూమ్ నిండా నిషేధిత మాండ్రాక్స్ టాబ్లెట్స్ క‌నిపించాయి. అందులో మొత్తం రెండు కోట్ల ట్యాబ్లెట్లు ఉండ‌గా.. వాటి బ‌రువు 23.5 మెట్రిక్ ట‌న్నుల‌ని, విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుంద‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్‌ (సీబీఈసీ) చైర్‌ప‌ర్స‌న్ న‌జీబ్ షా వెల్ల‌డించారు. దీనిలో భాగంగా.. బాలీవుడ్‌కు చెందిన ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అరెస్ట్ చేశారు. డీఆర్ఐ చ‌రిత్ర‌లో ఇంత‌పెద్ద డ్ర‌గ్స్ రాకెట్ ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు.