TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ అరెస్టు.!

Published on: Sat Sep 19, 2026 9:55AM

 శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి   ఈడీ  దర్యాప్తులో కీలకమైన పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తాజాగా మరో కీలక నిందితుడిని అరెస్టు చేసింది.  సుకృతి ఫుడ్స్ సంస్థ ప్రమోటర్‌  కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కొనుగోళ్లు, సరఫరాలో ఆయన పాత్ర ఉందన్న   ఆధారాలతో   కైలాష్ చంద్ మంగ్లా ను ఈడీ అరెస్టు చేసింది. 

అరెస్టు చేసిన అనంతరం నిందితుడు కైలాష్ చంద్ మంగ్లాను విశాఖపట్నంలోని  పీఎంఎల్‌ఏ  కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు.  న్యాయస్థానం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.  టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లోపాలపై,  దీని వెనుక జరిగిన ఆర్థిక అక్రమాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  

  కైలాష్ చంద్ మంగ్లాకు చెందిన సుకృతి ఫుడ్స్ సంస్థ అసలు ఆవు నెయ్యికి బదులుగా వివిధ రకాల నూనెలు, రసాయనాలను ఉపయోగించి నకిలీ నెయ్యిని తయారు చేసినట్లు ఈడీ  తన దర్యాప్తులో గుర్తించింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా నమ్మించి, రిఫైండ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ వంటి   హానికరమైన రసాయన పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కల్తీ ఉత్పాదనలను ఏగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీగా ముద్ర వేసి టీటీడీకి సరఫరా చేసినట్లు ఈడీ  తన దర్యాప్తులో గుర్తించింది. 

గతంలో అనగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీకి జరిగిన నెయ్యి సరఫరా ఒప్పందాల విలువ సుమారు  230 కోట్ల రూపాయలుగా ఉంటుందని ఈడీ అంచనా వేసింది. ఇందులో కేవలం కైలాష్ చంద్ మంగ్లా ఫ్యాక్టరీ నుంచే సుమారు  96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని ఉత్పత్తి చేసి టీటీడీకి సరఫరా  ఈడీ పేర్కొంది.   

ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ అరెస్ట్ చేసిన రెండో ప్రధాన వ్యక్తిగా కైలాష్ చంద్ మంగ్లా.  ఈ అరెస్టుకు ముందు   ఇదే కేసులో అక్రమ నెయ్యి తయారీ, సరఫరా వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలతో విపిన్ జైన్ అనే మరో నిందితుడిని కూడా ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే.   

[Tirumala Adulterated Ghee Case, ED Arrest, Kailash Chand Mangla, Sukruti Foods, TTD Laddu Prasadam controversy, Telugu One]