చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. నిజమే గెలిచిందంటూ లోకేష్ ఎమోషనల్ పోస్టు.!
Published on: Thu Sep 10, 2026 10:42AM

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ.. ఈ అక్రమ అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో నాటి చీకటి రోజులను, కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపించిన మద్దతును గుర్తు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేం శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి
జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని స్కిల్ కేస్ పేరిట అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి బుధవారం (సెప్టెంబర్ 9) నాటికి సరిగ్గా మూడేళ్లయ్యింది. ఈ సందర్భంగా, చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ లోకేష్ సోషల్ మీడియాలో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఒక కల్పిత కేసులో అక్రమంగా నిర్బంధించిందని గుర్తు చేసుకున్నారు.

ఆయనను అక్రమంగా నిర్బంధించి 53 రోజజులూ సత్యమే గెలవాలి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చివరకు ప్రజలు కోరుకున్నట్లుగా సత్యమే గెలిచిందనీ, ఆ అక్రమ నిర్బంధం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఇక జగన్ సర్కార్ చంద్రబాబుపై బనాయించిన అక్రమ కేసులన్నిటినీ కోర్టులు కొట్టి వేశాయని చెప్పారు. క్లిష్ట సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. అక్రమ అరెస్టు ఘటనతో చంద్రబాబు ఏ మాత్రం కుంగిపోలేదు, మనోధైర్యం కోల్పోలేదు సరికదా.. ధైర్యంగా నిలబడి రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. అఖండ ప్రజాదరణతో తిరిగి అధికారపగ్గాలు చేపట్టారు.
[Chandrababus arrest,Three Years, Nara Lokesh, truth prevailed, Skill Development case, TDP anniversary]


