TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2009-2010 విద్యుత్‌ సర్‌చార్జీలపై హైకోర్టు స్టే

Published on: Thu Aug 2, 2012 10:18AM

2009 -2010 విద్యుత్‌ బిల్లులో ఇందన సర్‌చార్జీల బకాయిల( ఎఫ్‌ఎస్‌ ఎ) వసూలుపై రాష్ట్ర హైకోర్టు  స్టే విధించింది. సుమారు వందకు పైగా పారిశ్రామిక వినియోగదారులు దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి ధర్మాసనం విచారణకు అనుమతించింది. ఇప్పటికే వసూలు చేసిన బిల్లులను రాబోయే బిల్లుల్లో సర్దుబాటుచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.


 

2008-2009 సంవత్సరపు సర్‌చార్జీల కేసు సుప్రీంకోర్టులో ఉండగానే తదుపరి సంవత్సరాలకు బిల్లులు వసూలుచేయటం చట్ట వ్యతిరేకమని పిటీషనర్‌ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రతి నాలుగు నెలల అనంతరం విద్యుత్‌సర్‌చార్జీలను నెలలోపు వసూలు చేయాలన్న నిబంధనను మరచి, సంవత్సరాల అనంతరం వసూలుకు చర్యలు చేపట్టటం చట్టవ్యతిరేకం అని వివరించారు. ఈ ఆదేశం పిటీషనర్లకు మాత్రమే కాక, ఇంకా పిటీషన్లు దాఖలు చేయని పారిశ్రామిక సంస్ధలకు సైతం వర్తిస్తుందని న్యాయమూర్తి మౌఖికంగా తెలియచేశారు.