ఫార్ములా ఈరేస్ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా.!
Published on: Fri Sep 18, 2026 12:18PM

ఫార్ములా ఈ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు వచ్చే నెల 30కి వాయిదా వేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 17) జరిగిన విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతోపాటు ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ 3గా ఉన్న మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డీ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

అనంతరం కోర్టు ఛార్జ్‌షీట్‌ను స్వీకరించి నిందితులకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నుంచి విదేశీ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సుమారు రూ.55 కోట్ల నిధులు బదిలీ చేసిన వ్యవహారంపై గా ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. అవసరమైన అనుమతులు, ఆర్థిక నిబంధనలను పాటించకుండా చెల్లింపులు జరిగాయన్నది దర్యాప్తు సంస్థ ఆరోపణగా ఉంది. ఈ ఆరోపణలను కేటీఆర్ గతంలో ఖండించారు. ఇప్పటికే పలుమార్లు కోర్టు విచారణకు వచ్చిన ఈ కేసులో తాజా విచారణ అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి నాంపల్లి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
[KTR, Nampally ACB Court, Formula E Case, Arvind Kumar, BRS party, RS 55 Crores, Hearing, Adjourned]


