TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేదలను దోచేస్తున్న మట్కా.కామ్ జూదం

Published on: Fri May 25, 2012 1:48PM

నిన్నటి వరకూ సిగరెట్టు అట్టపెట్టెలపై ఉన్న నెంబర్లు ఆధారంగా నడిచిన మాట్కాజూదం ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా జూదర్లు ఈ ఆట ఆడేస్తున్నారు. మట్కా .కామ్ వెబ్ సైట్ సహాయంతో ఈ జూదం విస్తరిస్తోంది. ముంబయి కళ్యాణ్, మిలన్ డే, మిలన్ నైట్, బూత్ నాథ్ న్యూ, బత్ నాథ్ కళ్యాణ్ పేర్లతో ఆట ఉంటుంది. వీటి పేరిట ఒక్కొక్క పేజీ ఉంటుంది. నిన్నటి దాకా పాన్ షాపుల సహాయంతో నడిచిన ఈ ఆటకు ఇప్పుడు ప్రాంతాల వారీగా ఏజెంట్లు పుట్టుకొచ్చారు. అలానే పందెం పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ ఎంతైనా కట్టవచ్చు.దీనిలో ఓపెన్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ లపై నెంబర్ల వారీగా విడివిడిగానూ, కలిపి బ్రాకెట్ గానూ పందెం ఆడవచ్చు. ఇలా వెబ్ సైట్ ఆధారంగా జరుగుతున్న ఈ మట్కాజూదం ఎరకు మధ్యతరగతి ప్రజలు దొరికేస్తున్నారు. డబ్బులు వచ్చినప్పుడు ఆనందం, పోయినప్పుడు భార్య మెడలోని బంగారు వస్తువులు తాకట్టు పెట్టి ఆడామన్న నిజాన్ని చెబుతారు. ప్రభుత్వాల కన్నుగప్పి ఆడుతున్న ఈ మాట్కాజూదం పై ప్రభుత్వం ఎప్పటికి కన్నేస్తుందో అని పలువురు ఎదురుచూస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువగా తెలంగాణా జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ఉందని తెలుగువన్.కామ్ పరిశీలనలో తేలింది.