TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాయకారావుపేట కాంగ్రెస్ టికెట్టుకై మహిళపోటాపోటి

Published on: Sat Apr 14, 2012 4:37PM

విశాఖజిల్లా పాయకారావు పేట కాంగ్రెస్ టికెట్టు కోసం ఇద్దరు మహిళలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీఎమెల్యే గంటేలా సుమన, రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని అనిత తీవ్రంగాపోతోపడుతున్నారు. నిజానికి గంటెల సుమనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, హఠాత్తుగా విద్యాశాఖలో ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్తగా పని చేస్త్తున్న అనిత అనుహ్యంగా విజయప్రసాద్ మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో గంటెల సుమన తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. గంటెల సుమనకు జిల్లా మంత్రి బలరావు , యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ఎమ్మెల్సీ జి.వి. సూర్యనారాయణరాజు, డిసిసి అధ్యక్షుడు తోట నగేష్ మద్దతు ఇస్తున్నట్లు తేల్సుతుంది. దీంతో పాయకరావు టికెట్టుపై జిల్లా కాంగ్రెస్ రెండు సగాలుగా వీడిపోయినట్టు తెలుస్తోంది. ముక్కు మొహం తెలియని అనితకు టిక్కెట్ ఇస్తే పార్టీ  ఓటమి తధ్యమని పాయకరావుపేట కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.