TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గౌతంకుమార్ కి కలిసిరాని కాలం

Published on: Sun Aug 26, 2012 2:13PM

రాష్ట్ర ప్రభుత్వాలు సీనియరిటీని పక్కనపెట్టి అస్మదీయులకు డిజిపి పదవి ఇవ్వడం ఒక తంతుగా మారింది. కోర్టుల్ని కూడా లెక్కచేయకపోవడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల లౌక్యం తెలియని ఐపియస్‌ ఆఫీసర్లు బలౌతున్నారు.1975 బ్యాచ్ కు చెందిన గౌతంకుమార్  దీనికి మంచి ఉదాహరణ. అప్పట్లో సీనియారిటీని తోసిరాజని అరవింద్ రావుకి డిజిపి పదవిని కట్టబెట్టారు. తనకు న్యాయం చేయాలని గౌతంకుమార్ హైకోర్ట్ ని ఆశ్రయించడంతో ఆయనకే అనుకూలంగా తీర్పొచ్చింది. ప్రభుత్వం దీనిపై డివిజన్ బెంచ్ కి పిటిషన్ దాఖలు చేసింది. వ్యవహారం తేలేలోగా అరవింద్ రావు రిటైరైపోయారు.  తర్వాత కూడా గౌతం కుమార్‌కి ప్రభుత్వం మొండి చెయ్యి చూపి దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించింది. దినేష్‌ రెడ్డి డిజిపి నియామక సమయానికి కెఆర్‌ నందన్‌ కి సీనియారిటీ ఉంది. కానీ.. ఆయన ఆ కుర్చీలో కూర్చోవడానికి ఇష్టపడలేదు. తర్వాతి వంతు న్యాయనికి గౌతంకుమార్ ది. కానీ.. ప్రభుత్వం ఆయన్ని కాదని దినేష్ రెడ్డిని కుర్చీలో కూర్చోపెట్టింది. గౌతంకుమార్ కి సీనియారిటీతోపాటు సమర్థత కూడా ఉంది. కానీ లాబీయింగ్ లో మాత్రం చాలా వీక్.. అందుకే పదవిని రెండుసార్లు వేరేవాళ్లు తన్నుకు పోయారు.  దినేష్‌రెడ్డి 1977 బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్. కానీ.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు అదృష్టాన్ని మోసుకొచ్చాయి. క్యాట్ కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది. పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ అప్పీలుకెళ్లింది. మనస్తాపంతో గౌతంకుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.