TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో దస్తగిరిని ఏడు గంటలు ప్రశ్నించిన ఈడీ..!

Published on: Thu Sep 3, 2026 7:07PM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితుడు దస్తగిరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. దాదాపు 7 గంటలుగా విచారణ కొనసాగింది. ఆగస్టు 21న దస్తగిరి నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు ల్యాండ్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య అనంతరం దస్తగిరి పలు భూ సెటిల్‌ మెంట్లు చేసినట్లు ఈడీ అనుమానిస్తున్నారు. సోదాల్లో లభించిన భూ సెటిల్‌మెంట్లకు సంబంధించిన పత్రాలపై ఈడీ అధికారులు దస్తగిరిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దస్తగిరి, ఆయన భార్యకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు.

 

వివేకా హత్యకు ముందు, హత్య అనంతరం జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. భూ లావాదేవీలు, బ్యాంకు ఖాతాల్లో జరిగిన నగదు లావాదేవీలు, హత్య కేసుతో వాటికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఆర్థిక లావా దేవీలు, భూ సెటిల్‌మెంట్ల పై ఈడీ దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించు కుంది.

 

 

 

(Viveka Murder Case, YS Vivekananda Reddy, Enforcement Directorate, Dastagiri, Money Laundering, 40 Crore Deal, YS Jagan, YS Sunitha, CBI, MP Avinesh reddy, Telugu One, Telugu News)