TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి...కమిషనర్‌కు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..!

Published on: Wed Sep 9, 2026 2:37PM

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు డా. మల్లు రవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ మేరకు బుధవారం పోలీస్ కమిషనర్‌ ను కలిసి ఒక  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు లో మల్లు రవి పలు అంశాలను ప్రస్తావించారు. కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి అత్యంత ఆక్షేపణీయమైన, అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సదరు వ్యాఖ్యలను సాధారణ సందర్భో చిత అర్థంలో పరిశీలించినా ముఖ్య మంత్రిని అత్యంత తక్కువ చేసి, అవమానించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు చట్టబద్ధమైన పరిమితులు ఉన్నాయని, అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానం, నిర్ణయం లేదా రాజకీయ చర్యపై చేసిన విమర్శలు కాదని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి వ్యక్తిగత గౌరవం, ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో చేసిన వ్యక్తిగత దాడిగా ఆ వ్యాఖ్యలను పరిగణించా లని కోరారు. ముఖ్యమంత్రి ఒక ప్రజా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అని, ఆయన ప్రతిష్ట ప్రజా హోదాలో బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యంతో ముడిపడి ఉంటుందని మల్లు రవి పేర్కొన్నారు. బహిరంగ వేదికపై ప్రముఖ ప్రజాప్రతినిధి చేసిన ఇలాంటి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించే విగా, అవమానకరంగా ఉన్నాయని ఆరోపించారు.

టెలివిజన్, వార్తాపత్రికలు, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యాఖ్యలు ప్రచారం కావడంతో పరిస్థితి మరింత తీవ్రతర మైందని ఫిర్యాదులో తెలిపారు. సంబంధిత వీడియోలు, ప్రసారాలు, సోషల్ మీడియా పోస్టులు తదితర ఎలక్ట్రానిక్ ఆధారాలను వెంటనే భద్రపరచి, సేకరించాలని పోలీసులను కోరారు. BNS సెక్షన్ 356 కింద పరువు నష్టం, BNS సెక్షన్ 352 కింద ఉద్దేశపూర్వక అవమానానికి సంబంధిం చిన నిబంధనల ప్రకారం తగిన చర్యలు ప్రారంభిం చాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు. 

విచారణలో వెల్లడయ్యే ఇతర చట్టపరమైన నిబంధనల కింద కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పరువు నష్టం కేసుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన BNSS సెక్షన్ 222 సహా వర్తించే విధానపరమైన నిబంధన లను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చారు. అవమానకరమైన విషయాలను మాట్లా డటం, ప్రచురించడం, పునరుత్పత్తి చేయడం లేదా ప్రచారం చేయడంలో బాధ్యులైన వ్యక్తుల పాత్ర ఏమైనా ఉన్నట్లయితే, దర్యాప్తు ద్వారా గుర్తించి వారిపై కూడా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవా లని ఎంపీ కోరారు.

అయితే మొత్తం వ్యవహారంపై నిష్పాక్షికంగా, చట్టబద్ధ మైన పద్ధతిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు.
ఈ ఫిర్యాదును అధికారికం గా రికార్డుల్లోకి తీసుకొని, ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు చేపట్టి, వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని మల్లు రవి పోలీస్ కమిషనర్‌ను కోరారు. ముఖ్యమంత్రి పదవి, వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచేలా బహిరం గంగా చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాల్సిన అవస రం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 

 

(MP Mallu Ravi complains to the Commissioner, CM Revanth rddy, KTR, Mlc Tata Madhu, Naveen Reddy, BRS party, KCR, Police Commissioner, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News)