TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా డీఎస్పీల బదిలీలు..!

Published on: Tue Sep 8, 2026 6:47PM

17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!

తెలంగాణ పోలీస్‌ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగులు జరిగాయి. పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సిఫార్సుల మేరకు డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 17 మంది డీఎస్పీ స్థాయి అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగులు కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. మల్కాజ్‌గిరి సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్‌.జి. శివ శంకర్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న కె. బాలకృష్ణ రెడ్డిని ఏసీపీగా నియమించారు. శివ శంకర్‌ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

వెయిటింగ్‌లో ఉన్న షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌కు జయశంకర్‌ భూపాలపల్లి డీసీఆర్‌బీ, ఫంక్షనల్‌ వర్టికల్స్‌ డీఎస్పీగా, ఎ. రవి కుమార్‌కు జగిత్యాల డీసీఆర్‌బీ డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. బి. నందిరామ్‌ నాయక్‌కు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ డీఎస్పీగా, బి. సోంనారాయణ్‌ సింగ్‌కు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (TGPA) డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. బి. శ్యామ్‌ సింగ్‌కు మెదక్‌ డీసీఆర్‌బీ, ఫంక్షనల్‌ వర్టికల్స్‌ డీఎస్పీగా, ఎన్‌. శ్రీనివాస్‌ రెడ్డికి సంగారెడ్డి డీసీఆర్‌బీ డీఎస్పీగా పోస్టింగ్‌ కల్పించారు. జె. వెంకటేశ్వరరావుకు కూడా డీఎస్పీగా కొత్త పోస్టింగ్‌ ఇచ్చారు.


హైదరాబాద్‌ సిటీలోనూ పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. బి. కిషన్‌ కుమార్‌, ఎన్‌. శంకర్‌లను సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఏసీపీలుగా, ఎల్‌. రమేష్‌ కుమార్‌ను హైదరాబాద్‌ సిటీ సీటీసీ (CTC) ఏసీపీగా నియమించారు. కొమట్ల సుబ్బా రామిరెడ్డి, ఎస్‌. సుదర్శన్‌లకు హైదరాబాద్‌ సిటీ సీసీఎస్‌ అండ్‌ డీడీ ఏసీపీ పోస్టింగులు ఇచ్చారు. పి. విజయ్‌ కుమార్‌కు వెస్ట్‌జోన్‌ రోడ్‌ సేఫ్టీ డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇప్పటికే వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న పలువురు అధికారులను కూడా బదిలీ చేశారు. కె. భాస్కర్‌ను రాజన్న సిరిసిల్ల డీసీఆర్‌బీ నుంచి TGPAకి, ఎం. వెంకట నరసయ్యను ఆదిలాబాద్‌ డీసీఆర్‌బీ నుంచి సీఐడీ డీఎస్పీగా బదిలీ చేశారు.

బదిలీ అయిన అధికారులు, కొత్తగా పోస్టింగులు పొందిన అధికారులు వెంటనే తమ ప్రస్తుత విధుల నుంచి రిలీవ్‌ అయి, కొత్త పోస్టింగ్‌ ప్రదేశాల్లో విధుల్లో చేరాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. సంబంధిత యూనిట్‌ అధికారులు అధికారులను వెంటనే రిలీవ్‌ చేసి, వారు కొత్త స్థానాల్లో రిపోర్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రిలీవ్‌ తేదీలను డీజీపీ కార్యాలయానికి తెలియజేయడంతో పాటు, కొత్త పోస్టింగ్‌ ప్రదేశాల్లో చేరిన అనంతరం సీటీసీలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తంగా ఒకేసారి 17 మంది డీఎస్పీ స్థాయి అధికారులకు స్థానచలనం కల్పించడంతో తెలంగాణ పోలీస్‌ శాఖలో బదిలీల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది

 

 

(Massive transfers of DSPs in Telangana, DGP C.V. Anand, CP Sajjanar, CM Revanth reddy, Malkajgiri Cyber ​​Crimes, Telangana goverment, Telugu One, Telugu News)