కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..!
Published on: Tue Sep 8, 2026 9:09PM
.webp)
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ప్రింటింగ్ పరిశ్రమ కావడంతో అక్కడ నిల్వ ఉంచిన పెయింట్స్, ఇతర ప్రింటింగ్ సామగ్రి కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతు న్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
.webp)
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. మంటలు మరింత వ్యాపించకుండా పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.అగ్నిప్రమా దానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలి యాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు..
(Kukatpally Prashanthnagar, ABC Printing, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telugu news, Telugu One)


