గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ.. అధికారికంగా కొండా సురేఖ బర్తరఫ్..!
Published on: Thu Sep 3, 2026 9:23PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటించింది. కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ప్రెస్ కమ్యూనికేలో వెల్లడించారు. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ మేరకు 2026 సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి రాజ్‌భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.దీంతో కొండా సురేఖ ఇకపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగరు. అయితే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడానికి దారితీసిన కారణాలను మాత్రం అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు వెలువడిన ప్రకటనతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఈ పరిణామం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా వెళ్లారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అంశంపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. ఆమె బర్తరఫ్‌కు దారితీసిన పరిస్థితులను రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం ఎదురుగానే గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు తెలిసింది.
(CM Revanth Reddy, Konda Surekha, Telangana Politics, Telangana Cabinet, Konda Surekha Dismissal, Telangana Governor, Shiv Pratap Shukla, Lok Bhavan, Revanth Reddy Meeting, Telangana Government, Telugu one, Telugu news)


