విశాఖలో ఐఎస్‌ల మద్యవార్
Published on: Sun Aug 19, 2012 10:46AM
విశాఖపట్టణంలో ఇద్దరి ఐఎఎస్ అధికారుల అధికారుల మద్యపచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఉన్నత స్ధాయి అధికారులమని మరచి పోయి ప్రతి చిన్న విషయానికి రచ్చకెక్కటం ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది. ఒకరు విశాఖ కలెక్టర్ లవ్ అగర్వాల్కాగా మరొకరు మహావిశాఖ నగర పాలక సంస్థ కమీషనర్ రామాంజనేయులు. ఆరు నెలల క్రితం జివిఎంసీపాలక వర్గం పదవీకాలం ముగిసి పోవడంతో దానికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టాలని రామాంజనేయులు ప్రయత్నించారు.
అయితే లవ్ అగర్వాల్ పోటీపడి ఆ పదవిని దక్కించుకున్నారు. అప్పటినుండి ఇద్దరికి మద్య విభేదాలు ముదిరాయి. ప్రత్యేక అధికారిగా జీవియం ఫైళ్లను తొక్కి పెడుతున్నారనేది కమీషనర్ వాదన. ఇటీవల కాలంలో బదిలీలలో వీరిద్దరి పేర్లు ఉండగా విశాఖ అభివృద్దికి ఇద్దరం కలసికట్టుగా పని చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్‌కు చెప్పి బదిలీ లేకుండా చేసుకున్నారు. అయినా యధాప్రకారం దులాడుకుంటున్నారు. మంత్రి తనకంటే కలెక్టర్‌కే అధిక ప్రాధాన్యత నిస్తున్నారని కమీషనర్ మరో మంత్రి బాలరాజు చెంత చేరారు.తాజాగా స్వాతంత్య్రదినోత్సవ నాడు వారి విభేదాలు తారా స్ధాయికందుకున్నాయి. ఆరోజు జిల్లా కలెక్టరు ఆఫీసులో జెండా ఎగురవేసి జివిఎంసీలో కూడా ఎగురవేద్దామని లవ్ అగర్వాల్ అక్కడకు చేరుకోగా అక్కడ తలుపులు వేసిఉండటంతో అవాక్కయ్యారు.
దీంతో సంబంధిత ఏఈ పై నిప్పులు చెరిగి, బ్లడీ ఆర్గనైజింగ్ అంటూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవియంసీ లో తనను కావాలనే అవమాన పరిచారని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అయితే కమీషనర్ వాదన మరోలా ఉంది. తన కంటే జూనియర్ అధికారులు వారి కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరిస్తే కలెక్టర్ కావాలనే ఇదంతా చేశారని మంత్రి బాలరాజుకు వివరించి ఆయన సాయంతోడిప్యూటీ సీఎం రాజనరసింహను కలసి తన వాదనను వినిపించారు. ఈవిషయంలో ఎవరూ తగ్గక పోగా తాడో పేడో తేల్చుకుంటామని బుసలు కొడుతున్నారు. అయితే వీరిద్దరి మద్య జిల్లాపరువు పోతుందని నగరవాసులు వాపోతున్నారు. వీరి పంతాలు పట్టింపులకే సమయం సరిపోతుందని, ప్రజలసమస్యలను గాలికి ఒదిలేశారని స్దానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వీరిరువరినీ బదిలీ చేయాలని కోరుతున్నారు.


