TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిషన్‌రెడ్డి హత్యకు ఉగ్రవాదులు ప్లాన్

Published on: Sun Sep 2, 2012 1:20PM

కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదులను విచారిస్తే కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. దక్షిణ భారత దేశంలోని ఒక అణు సంస్థను, పలు రక్షణ సంస్థలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. అంతే కాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మరో ఇద్దరు కార్పొరేటర్లను చంపత్నికి ప్లాన్ చేశారు. ఈ విషయాలను బెంగళూరు పోలీసు కమిషనర్ జ్యోతిప్రకాష్ మిర్జి విలేకరులకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఉబేద్ ఉర్ రెహ్మాన్ వీరందరితో కలిసి ఈ కుట్ర పన్నినట్లు తెలిసింది. బెంగళూరు పోలీసులు అరెస్టుచేసిన 11 మంది ఉగ్రవాదుల నుంచి 7.65 ఎంఎం పిస్టల్ ఒకటి, ఏడు కార్ట్రిడ్జ్‌లు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, మూడు పెన్ డ్రైవ్‌లు, నాలుగు ఏటీఎం కార్డులు, ఏడు ల్యాప్‌టాప్‌లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు జీహాదీ సాహిత్యం, చెన్నై, భారతదేశాలకు చెందిన మ్యాప్‌లు, ఇరాన్ మ్యాప్, ఉర్దూ వార్తా పత్రిక కటింగ్‌లు కూడా ఉన్నాయి. వీరిని ప్రశ్నిస్తే వచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోగల వేర్వేరు ప్రాంతాల్లో మరో నలుగురిని అరెస్టుచేశారు.