కాపాడే దిక్కెవరు?
Published on: Sun Aug 19, 2012 12:10PM
ప్రజారోగ్యమే తమ లక్ష్యంగా చెప్పుకునే ప్రభుత్వ ఏలుబడిలో రోజురోజుకీ శిశుమరణాలు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో రోజుకు సగటున 7 నుండి 10 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారనీ అందుతున్న సమాచారం స్పష్టంచేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 16 మంది శిశువులు మృతి చెందారు. దీనికి కారణం ఇందులో వైద్యులు, నర్సులు, ఇతర సేవల కొరతే ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి.
అలాగే రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో ఇతర కారణాల వల్ల కూడా పిల్లలు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా సమస్యను పక్కదారి పట్టించే వ్యాఖ్యాలతో కాలం గడిపేస్తున్నారు మన నాయకులు. కొన్ని చోట్ల సరైన చికిత్స అందక, మరికొన్ని చోట్ల ఇతర వ్యాధులుసోకడం వల్ల పిల్లలు మరణిస్తుంటే స్పందనలేని పాలకులు, సంబంధిత అధికారులపై న్యాయవ్యవస్థే మానవతాదృక్పథంతో విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


