ఇంజనీరింగ్ కాలేజీలో హీరో నిఖిల్ దాదాగిరి
posted on: Jun 4, 2013 7:11PM

దుండిగల్‌లోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో హీరో నిఖిల్ హల్‌చల్ చేశారు. సీనియర్లను హీరో నిఖిల్ తమ్ముడు రోహిత్ కొట్టడంతో గొడవ జరిగింది. దీంతో హీరో నిఖిల్ అక్కడకు చేరుకుని ఇతర విద్యార్థులను పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. ఇంజీనిరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రోహిత్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో రోహిత్ సీనియర్లపై చేయిచేసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కళాశాల గేట్లను మూసివేశారు. పరిస్థితి అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.



.jpg)


